Source blog: HARI THE HERO
736 viewsలెజెండ్ ఆర్టికల్ కి వచ్చిన రెస్పాన్స్ స్ఫూర్తి తో.. ఇంచు మించి అదే స్టైల్ లో ..................

రౌడీ సినిమా చూసిన వాళ్ళు అందరికి సినిమా లో వచ్చే డిస్క్లైమర్ ఏ నేను వాడేసుకుంటున్నా.. 'పాత్రలు.. సన్నివేశాలు.. కేవలం వినోదం పంచటానికే..' .. చూడని వాళ్ళ కోసం నా సొంత డిస్క్లైమర్..  'ఊహకి అందిన ఒక కల్పిత గాధ..'

అనగనగా ఒక రోజు.. వర్మ తన ఇంట్లో.. అద్దం ముందు వోడ్కా తో.. (ఏ టైం లో తాగ కుండా ఉండరో తెలియదు కాబట్టి.. స్పెసిఫిక్ గా టైం చెప్పలేక పోతున్నాం)  ఫోన్ అందుకొని .. ట్విట్టర్ ఓపెన్ చేసి 'వేదింపులు మరియు అధికార దుర్వినియోఘం వలన ధన లక్ష్మి గారిపై క్రిమినల్ కేసు పెడుతున్నా - సత్య 2 కి సంబంధించి'..  ఈ సినిమా ఓపెనింగ్స్ కి తిరుగులేదు... మనసులో

వెంటనే ఫోన్ లో మెసేజ్.. 'సర్, వి సపోర్ట్ యు, నా సినిమాలకి కూడా ఇలాంటి ప్రొబ్లెమ్స్ ఏ వచ్చాయి - బాబు'

అస్సలు పట్టించుకోకుండా పక్కన పడేస్తూ.. కంప్యూటర్ లో సూసైడ్ గురుంచి పేపర్ కి లెటర్ రాయటం లో ఒక చెయ్యి బిజీ.. ఇంకో చేతిలో గ్లాస్ ఉంది లెండి..

కొన్ని రోజుల తర్వాత... సత్య 2 రివ్యూస్ ని - రివ్యూ చేసేసి.. ట్విట్టర్ లో తిట్టేసి.. రిలాక్స్ అవుతూ...

'ఎం తీసిన చూడటం మానేసారు గా జనాలు, అసలు ఎం తీస్తే చూస్తారు? అయిన వాళ్ళు చూసిన చూడక పోయిన ఐ డోంట్ కేర్, నేను చూసుకుంటా, , కనీసం తీయటానికి అయిన ఎవరో ఒకరు కావాలి గా, తీసింది ఎలాగు చూడటం లేదు కాబట్టి.. ఆల్రెడీ చూసింది తీస్తే సరిపోద్ది.. '

ఫోన్ వెతుక్కుంటూ.. దొరికాక ... ఒక ట్వీట్ (ఒరిజినల్ గా యాస్ ఇట్ ఈస్ గా) 'The ones more likely to succeed in life are not the ones who wait for things to fall in place but it's the ones who throw things into place .. Only dumbs wait fr opportunity to knock on their door ..The Smart ones wil keep the door open nd the real Smarts wil go out and look for it'


సో .. ఐ హావ్ టు లుక్ ఫర్ ఇట్ .. ఇప్పుడు సర్కార్, సర్కార్ రాజ్ చూడకుండా ఉంటూ, ఒక వేల చూసినా, ఈ కథ అదే అని తెలుసుకోలేని వాళ్ళు ఎవరుంటారు .... ' ఫోన్ తీసి కాంటాక్ట్ లిస్టు వెతుకుతూ..

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఒక పక్కన జిమ్ లో ఫోన్ మోగగానే
బాబు: సర్ వర్మ గారు, మీరెంతి సర్, నాకు ఫోన్..నా మెసేజ్ చూసారా సర్
వర్మ: మనం కలుద్దాం
బాబు: చెప్పండి అంకుల్, మిమ్మల్ని కలవతం నా అదృష్టం..
వర్మ: (సర్ ఏ బావుంది కదా.. అంకుల్ ఏంటి? ఏదో ఒకటి లే... ఎలాగోలా ఏడు).. వోడ్కా అలవాటు ఉందా? నీకు కథ చెప్తా.. (వీడొక్కదిథొ సర్కార్ తీయలేను గా, ఇంకోటి ఏదైనా చెప్పాలి)
చీర్స్..
బాబు: అంకుల్ కథ అదిరిపోయింది, ఒక సారి డాడి కి కూడా చెప్పండి.. ప్లీస్
కట్ చేస్తే: వర్మ - డాడి - బాబు... నో వోడ్కా...
డాడి: సీ మిస్టర్ వర్మ, మై సన్.. ఐ అం రియల్లీ ప్రౌడ్ అఫ్ మై డాటర్ అండ్ సన్ అండ్ సన్.. యువర్ స్టొరీ సూపర్.. ఐ అం పుట్టింగ్ మై సన్ ఇన్ యువర్ హాండ్స్.. యాస్ అన్ ఆక్టర్ ఎదిగే లా చెయ్యి...మేక్ హిం అ స్టార్
వర్మ: నాకు తెలుగు వచ్చు సర్.. నేను మీ బాబు ని ఎక్కడికో తీసుకేల్లిపోతా.. యు డోంట్ వర్రీ..

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
నైట్, హోటల్ లో, వోడ్కా తో అద్దం ముందు, 'ఇప్పుడు మనం కొత్తగా కామెడీ అంటే ఇంకో దొంగల ముటా లేక పోతే అప్పలరాజు అయిపోద్ది, ఇలా అయితే లాభం లేదు'

వర్మ: బాబు రిసెప్షన్, గాడ్ ఫాదర్ డీవీడీ ఉందా
ఆపరేటర్: సారీ సర్, కావాలంటే సర్కార్ అండ్ సర్కార్ రాజ్ ఉన్నాయి
వర్మ; పంపించేయ్, ఇంకో బాటిల్ వోడ్కా కూడా..

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ముందు రోజు సినిమాలు చూడటం వలన వచ్చిన ఊపు తో, రెట్టించిన ఉత్సాహం తో..

వర్మ - డాడి - బాబు

వర్మ : మీకోసం కథ రెడీ చేసేసా, మిమ్మల్ని ఎవరు చూపించని విధం గా చూపిస్తా, విగ్ - మేక్ అప్ లేకుండా ఆక్ట్ చేస్తారా
డాడి; మై సన్, ఐ హవె డన్ 555 మూవీస్, డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ మూవీస్, ఎందులోనూ విగ్ లేకుండా వెయ్యలేదు, బట్ ఐ లవ్ యువర్ అప్రోచ్.. ఐ విల్ డు
బాబు: అంకుల్ నేను ఉన్నానా లేనా సినిమా లో
వర్మ: ఎహె ఒక్క నిమిషం ఉండు.. నువ్వు ఉన్నావ్ లే
బాబు: హమ్మయ్య.. (నవ్వుతు)
వర్మ; నువ్వు నవ్వకు, నీ సొట్ట బుగ్గ అంటే చిరాకు  నాకు.. అలా  పక్కకెళ్ళి కూర్చో.. బాబు మీతో పాటు జయసుధ గారిని పెడదాం
బాబు: అంకుల్ పిలిచారా
వర్మ: నువ్వు ఇక్కడ మళ్లీ కనిపించావ్ అనే సినిమా లో ఏ ఫ్రేమ్ లో ను కనిపించవ్.. నేను బాబు అన్నది డాడి ని..
బాబు అలిగి .. అప్పుడే వచ్చిన డిజైనర్ డ్రెస్ లు ట్రయల్ ఎసుకొటానికి వెళ్ళాడు.
వర్మ; మీ క్యారెక్టర్ పేరు అన్న..
డాడి: సూపర్.. థెరె ఇస్ ఓన్లీ వన్ అన్న ఇన్ థిస్ కంట్రీ.. తట్ ఇస్ నందమూరి తారక రామ రావు గారు, నౌ ఈఫ్ యు వాంట్ తు యూస్ తట్ నేమ్ ఫర్ మీ.. బహుశా అన్న అనే పదం నా కోసమే పుట్టినట్టు ఉండాలి..
వర్మ; మీకు ఇద్దరు కొడుకులు.. ఒకడు ఎదవ.. ఒకడు మీతో పటు ఉండే మీ లాంటి వాడు
డాడి: సీ మిస్టర్ వర్మ, .. రేస్పక్ట్ లేకుండా మాట్లాడకు .. బొత్ అఫ్ మై సన్స్ అండ్ మై డాటర్ ఆర్ బోర్న్ విత్ డిసిప్లిన్.. ఆ షిర్డీ సాయి నాధుని దయ వలన, ఆ ఏడు కొండల వాడి దయ వలన ఇద్దరూ క్రమ శిక్షణ కలిగిన హీరోస్ గా ఎదిగారు ఇండస్ట్రీ లో.. బొత్ ఆర్ జెమ్స్
వర్మ; నేను సినిమాలో సబ్జెక్టు చెప్తున్నా...
డాడి; ఓహ్.. నేను ఏదో అనుకున్నా.. సీ వర్మ.. ఐ ఒన్స్ అగైన్ టెల్ యు తట్, వితౌట్ రేస్పక్ట్ ఐ కాంట్ వర్క్.. ఐ విల్ నాట్ వర్క్
వర్మ: బేసిక్ గా మీరు అంటే నాకు రేస్పక్ట్ లేదు.. మేరు అదేదో సినిమాలో జయసుధ గారిని ఏడిపించారు
డాడి; సిల్లీ ఫెలో, అది మా గురువు గారి సినిమా.. నాతో పటు న గురువు గారికి కూడా రేస్పక్ట్ అవసరం
వర్మ: (అప్పుడే ఐడియా తట్టిన వాడిలా నవ్వుతు..) మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏ ఈ సినిమా.. ఈ సినిమా లో అన్న కి కూడా రెస్పెక్ట్ ఉంటె ఇంకా ఎం అవసరం లేదు.. మిమ్మల్ని ఎవ్వరు చూపించని విధం గా చూపిస్తా
డాడి: విగ్ లేకుండా అని ఆల్రెడీ చెప్పావ్ గా
ఒక్క సరి ఫోన్ చూసుకుంటూ... ఒక ట్వీట్.. 'ఆప్ ఇస్ ఢిల్లీ కా పాప్'
వర్మ: యు ఆర్ నాట్ గెట్టింగ్ మై పాయింట్.. ఇన్నాళ్ళు క్లోజ్ అప్ లో చూపించి ఉంటారు.. లాంగ్ షాట్ లో చూపించి ఉంటారు.. ఎదుటొడి సంక లో నుంచి చూస్తే ఎలా ఉంటారో మీకు తెలుసా? లుంగీ ఎత్తి రెస్పెక్ట్ తో కింద నుంచి చూస్తే ఎలా ఉంటారో మీకు తెలుసా.. కుర్చీ కన్నం లో నుంచి.. చెప్పుకి ఉండే గ్యాప్ లో నుంచి... రెండు ఆకుల మద్య లో నుంచి.. బాగా క్లోజ్ అప్ లో మీ మొహం లో ముడతలు ఎవరైనా చూసారా ఇప్పటిదాకా... డైలాగ్ కింగ్ అయిన మీరు డైలాగ్ చెప్తుంటే ఎదుటొది మొహం మీద ఎవరైనా కెమెరా పెట్టార ఇప్పటిదాకా..లుంగీ కట్టుకొని.. గన్ పట్టుకొని ఎప్పుడైనా డాన్సు వేశార మీ కెరీర్ లో..మీరు ఉండగా మీ బాబు పవర్ఫుల్ డైలాగ్స్ ని నలిపేస్తూ చెప్తే ఆ టైం లో వచ్చే కన్నీళ్లు కంట్రోల్ చేసుకోగలరా..
డాడి: టేర్రిఫిక్.. వి అరె డూయింగ్ థిస్ మూవీ..
ఇంతలో డ్రెస్ లు ట్రయల్ అయిపోయి బాబు వచ్చాడు..
డాడి: బై ద వే.. వాట్ అబౌట్ మై సన్.. యు హవె టు మేక్ హిం అ స్టార్
బాబు: ఎస్ అంకుల్.. నాన్న గారు నన్ను స్తార్ గా చూడాలి అనుకుంటున్నారు (నవ్వుతు)
వర్మ: నువ్వు నవ్వకు.. నీ నవ్వు అంటే చిరాకు నాకు .. ఈ సినిమా తర్వాత నువ్వు స్టార్ అంతే
బాబు వెంటనే ఫోన్ తీసుకొని 'తమ్ముడు నన్ను వర్మ గారు స్తార్ ని చేస్తా అంతున్నారు'
వర్మ - ఫోన్ లో.. ట్విట్టర్ లో .. ట్వీట్ ... 'ఆప్ ఈస్ పాప్.. మోర్ బిగ్గర్ పాప్స్ ఆర్ ఢిల్లీ వోటేర్స్'
డాడి: మన సినిమా అంటే మరి సాంగ్స్ కూడా ఉండాలి గా
బాబు: అంకుల్ నాకు కూడా
వర్మ: నన్ను నమ్మండి.. నాకు వదిలెయ్యండి.. రేస్పక్ట్ స్పెల్లింగ్ దగ్గరుండి రాయిస్తా..  బాలన్స్ వెండి తెర పై చూడండి...
బాబు; అంకుల్, తమ్ముడు టైటిల్ ఏంటి అని అడుగుతున్నాడు..అలాగే  ప్రొడ్యూసర్స్ ఎవరు?
వర్మ: కొంచెం సేపు అలోచించి.. 'రౌడీ' .. అండ్ సొంతం గా నే తీసుకుందాం.. ఎం అంటావ్?
బాబు: వెంతనే రిజిస్టర్ చేయించమని చెప్తా
వర్మ: 'అదే చేత్తో చెక్ బుక్ కూడా తీసుకు రా'.. ఫోన్ తీసుకొని.. 'నేను బాబు తో సర్కార్ తీస్తున్నా అని వస్తున్న మీడియా వార్తలు సుద్ధ అబద్డ్డం.. నేను తీసేది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక ఏక్షన్ ఫిలిం' ట్వీట్ చేసి డాడి కి చూపించాడు..
డాడి: మీడియా లో వార్తలు ఎప్పుడు వచ్చాయి
వర్మ ఒక నవ్వు నవ్వి.. చెక్ తీసుకొని.. ఫోన్ చూసుకుంటూ కార్ ఎక్కేసాడు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

రిలీజ్ రోజు.. ప్రెస్ షో లో

డాడి; ఏంటి వర్మ అందరు.. సర్కార్ అని అరుస్తున్నారు
ఒక పక్క పవన్ కళ్యాణ్ 'ఇసం' బుక్ కి రివ్యూ అండ్ ఇంకో పక్క ఓపెన్ లెటర్ టు పవన్ కళ్యాణ్ రాస్తూ బిజీ గా ఉన్న వర్మ ఒక్క సారి గా పక్కకి తిరిగి
వర్మ: సర్కార్ అంటే హిందీ లో అన్న అని అర్ధం బాబు
డాడి; సెకండ్ హాఫ్ లో... ఏంటి సర్కార్ రాజ్ అని అరుస్తున్నారు
వర్మ; యువర్ సన్ గురుంచి.. సీ ఐ మేడ్ హిం అ స్టార్


డాడి.. ప్రెస్ ని ఉద్దేశించి : 'మై డియర్ మీడియా, వర్మ సైడ్ తట్ మై సన్ ఇస్ అ స్టార్ నౌ ... కాబట్టి మీరు ఎం రాయాలి అనుకున్నా  రేస్పక్ట్ తో రాయండి.. రేస్పక్ట్ తగ్గిందో... ఉఫ్ఫ్ (సినిమా లో అదే స్టైల్ లో)
మీడియా మిత్రుడు 1; అన్న, ఎం చెప్పాలి అనుకుంటున్నారు అంటావ్
మీడియా మిత్రుడు 2; అర్ధం కాలేదా.. 2 ఏసే దగ్గర 3.. 2.5 ఏసే దగ్గర 3.5 ఎయ్యమంటున్నరు..
మీడియా మిత్రుడు 1; మరి 3.25
మీడియా మిత్రుడు 3; అది ఎవరు పడితే వాళ్ళు ఎసేయ్యకూడదు.. అది మా సైట్ కి బ్రాండ్ రేటింగ్ :)

మీ
హరి కృష్ణ రాజు

స్పెషల్ రెస్పెక్ట్  టు - సాయి గారు, శేషు గారు